సోనూ సూద్‌ గొప్ప మనసు..గ్రామాలకు డెడ్ బాడీ ఫ్రిజర్

52
sonusood

రియల్ హీరో సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ, ఏపీలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్‌ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర ఇతర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

అనేక గ్రామాల్లో ప్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనూసూద్‌ని సంప్రదించగా ఆ గ్రామాలకు సాయం చేసేందుకు ముందకొచ్చారు. ఇన్నాళ్లు ఈ గ్రామాల వారు సమీప నగరం నుండి ఫ్రీజర్ బాక్స్ రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల శవాలు కుళ్లిపోయి అయిన వారి చివరి చూపుకు దూరమయ్యేవారు. ఇది చాలా అసౌకర్యాలకు కారణమైంది. సహాయం కోసం సోను సూద్‌ను సంప్రదించడంతో ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా బాక్సులను అందుబాటులో ఉంచుతామని సోనూ హామీ ఇచ్చారు.