ఇప్పుడు మన దేశం సినిమాలో క్రీడలు పైకూడా కథలు రాసి సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. అమీర్ ఖాన్- దంగల్ వెంకటేష్ – గురు కమర్షియల్ సినిమాలైతే.. బాగ్ మిల్కా బాగ్.. మేరి కోమ్ సినిమాలు ఒరిజిన్ స్పోర్ట్స్ బయోపిక్స్.అయితే ఇప్పుడు బ్యాడ్మింటన్ యువ సంచలనం తెలుగు తేజం సింధు జీవితం పై కూడా ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమాను హింది, తెలుగు నటుడైన సోనూ సూద్ నిర్మిస్తున్నారు. సినిమాకు సంభందించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ కూడా హైదరాబాద్ రియల్ లొకేషన్లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోనూ సూద్ మాటలాడుతూ “ సింధు కూడా ఈ ఫిల్మ్ లో భాగం అయితే నేను చాలా సంతోషిస్తాను. తను తప్పకుండ సినిమాలో ఒక‌్క సీన్ అయినా చేస్తారు. అది ఎలా ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ పని జరుగుతుంది. ఈ పాత్ర కోసం ఇంకా మేము లీడ్ గాళ్ ఎవరు అనేది డిసైడ్ కాలేదు” అని చెప్పారు.
పీవీ సింధు..తన ఎనిమిది ఏళ్ల వయసులోనే నిర్ణయం తీసుకుంది.. తనకు ఏమి కావాలో దానికి ఏమి చేయాలో. అనుకున్న విధంగానే కఠోర దీక్షతో కొన్ని ఏళ్ళు తపించింది దాని కోసం. చివరికి తన ప్రతిభ మరియు గురువు గోపి చంద్ సహకారంతో మొన్ననే రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ సాధించి తీసుకొచ్చి.. మన దేశం ఖ్యాతిని పెంచింది.ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు
అయితే ఈ ససిమాలో సింధు పాత్రకు ఎవరైతే బాగుంటుందని అలోచిస్తున్నాడు సోను. మరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అయితే పాత్రకి సరిపోతుందని మరి దీపిక కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ కాబట్టి ఆమెను తీసుకునే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా ఏవి ఒక కొలికి రాలేదు కాబట్టి దీపికా కేవలం ఒక ఊహ చిత్రం మాత్రమే అని చెప్పవచ్చు. మరి గురువు గోపి చంద్ పాత్ర ఎవరు చేస్తారో చూడాలి…ఈ సినిమా గురించి నటి నటులు ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది.