- Advertisement -
లూథియానా కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఫిబ్రవరి 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని.. అభిమానులు కంగారు పడవద్దని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు సోనూ సూద్.
ఇది పూర్తిగా మీడియాలో ప్రచారం కోసమే చేస్తున్న చర్య అని.. కొంతమంది చేస్తున్న దానికి సలెబ్రెటీలు టార్గెట్ కావడం బాధాకరమన్నారు. ఈ వ్యవహారంపై కఠినంగా ముందుకు వెళ్తానని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.
ఈ కేసు తనకు ఎలాంటి సంబంధం లేదని.. మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు అన్నారు సోనూ సూద్ . తాను ఏ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా లేనని అలాగే ఆ బ్రాండ్లలో భాగస్వామనికి కూడా కాదని తెలిపారు.
Also Read:పీఎం కిసాన్ అప్‌డేట్..
- Advertisement -