కిసాన్‌గా సోనూసూద్!

86
sonu

బాలీవుడ్ నటుడు సోనూసూద్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. సోనూ సూద్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కనుంది. నివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిసాన్ అనే టైటిల్ ఖరారు చేయగా రాజ్ శాండిల్యా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తన సినీ కెరీర్‌లో తొలిసారి ప్రధానపాత్రలో నటిస్తున్న సోనూసూద్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పెషల్ విషెస్ తెలిపారు.

కరోనా,లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో కీ రోల్ పోషించారు. తాను రీల్ లైఫ్‌లో మాత్రమే విలన్‌నని రియల్ లైఫ్‌లో హీరోనని నిరూపించుకున్నారు సోనూ. తన ఆస్తులను తాకట్టుపెట్టి మరి సోనూ ఇతరుల కష్టాలను తీరుస్తుంటంతో దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం తెలుగులో ఆచార్య సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ అనే సినిమాలలో న‌టిస్తున్నారు.