- Advertisement -
తనకు సీఎం పదవిని ఆఫర్ చేస్తే దానిని తిరస్కరించానని చెప్పారు నటుడు సోనూ సూద్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం , డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు.
అయితే, ఆ అభ్యర్థనలను తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. స్వేచ్ఛను కోల్పోవడం తనకు ఇష్టం లేదని… అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా అని తెలిపారు.
ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారని ..ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం. వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే.. అది నేను ఇప్పటికే చేస్తున్నాను అని పేర్కొన్నారు.
Also Read:ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది: నిర్మాతలు
- Advertisement -