ఆవిర్భావ వేడుకలు..సోనియా దూరం!

5
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆమె టూర్ షెడ్యూల్ ఖరారు కాలేదు. ఎండ తీవ్రత కారణంగా ఆవిర్భావ వేడుకలకు హాజరకాలేక పోతున్నట్లు సమాచారం. ప్రోటొకాల్ ప్రకారం వేడుకల షెడ్యూల్లో సోనియాగాంధీకి కూడా టైం కేటాయించింది ప్రభుత్వం.సోనియాగాంధీ ని స్వయంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌తోపాటు ట్యాంక్‌బండ్‌పై ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. రెండు పూటలా దశాబ్ది వేడుకలు నిర్వహించనుండగా జూన్ 2న ఉదయం 9.30 గంటలకు గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

Also Read:వేరుశెనగలతో అద్భుత ప్రయోజనాలు

- Advertisement -