గాంధీభవన్‌లో సోనియా బర్త్ డే వేడుకలు..

54
- Advertisement -

తెలంగాణ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోనియా గాంధీ కేక్ కట్ చేసే హక్కు, అర్హత విహెచ్ కే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము ఈ కుర్చీలో ఉన్నమంటే కార్యకర్తల త్యాగం..డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండగ అన్నారు. 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిడుకులు ఎదుర్కున్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. డిసెంబర్ 7 న ఎల్బి స్టేడియంలో సోనియా గాంధీ వచ్చినప్పుడు తెలంగాణ తల్లి ని చూశానని…లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు నేనున్న అంటూ భరోసా ఇచ్చారన్నారు. ఎల్బి స్టేడియంలోకి సోనియా గాంధీ ప్రవేశించినప్పుడు ప్రజలు నిల్చొని అభినదించినప్పుడు ఆమె ముఖంలో సంతిషం కలిగిందన్నారు.మల్లి అలాంటి రోజు చూడలేం..పీసీసీ అధ్యక్షులు గా నాకు చాలా సంతోషం కలిగిందన్నారు.

2017 డిసెంబర్ 9 న మొదటిసారి గాంధీభవన్ లో కాలు పెట్టాను..ఇప్పుడు డిసెంబర్ 9 ముఖ్యమంత్రిగా వచ్చానని తెలిపారు. 10 సంవత్సరాల్లో కార్యకర్తలు వేల కేసులు మొస్తున్నారు..కార్యకర్తలకు మాట ఇస్తున్న ఈ ప్రభుత్వం మీది… పేదలదన్నారు. ఇందిరమ్మ ఆశయాలను నెరవేరుస్తాం..మొదటిసారి ఈరోజు అసెంబ్లీ లో అడుగు పెడుతున్నాం..మీ అందరు ఆశీర్వదించాలన్నారు.

- Advertisement -