కత్రీనా కైఫ్‌కు కరీనా కపూర్ అన్యాయం చేయడం ఏంటీ అనుకుంటున్నారా. తనను కాదని రన్‌బీర్ కపూర్ కు అక్క కరీనా కపూర్ పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో కరీనాపై కత్రీనా కైఫ్ గుర్రుగా ఉందట. తనకు అన్యాయం చేస్తుందంటూ బాధపడుతుందట. రన్‌బీర్ కపూర్, కత్రీనా కైఫ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వీరి లవ్ స్టోరీ పెళ్లి వరకు వెళ్లింది. ఇద్దరూ కలిసి ముంబైలోని ఓ ఫ్లాట్‌లో పెళ్లికి ముందే సహజీవనం కూడా చేశారు. అయితే ఏమైందో ఏమో అంతలోనే ఇద్దరు బ్రేకప్ అయ్యారు. గతంలో లాగా ఒకరినొకరు కలుసుకోవడం. ప్రస్తుతానికి రణ్‌బీర్ సింగిల్‌గానే ఉంటున్నాడు. దీంతో రన్‌బీర్‌కి అతని అక్కలు కరీనా కపూర్, కరిష్మా కపూర్ కు పెళ్లి సంబంధం చూస్తున్నారు. అల్రెడీ ఓ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేశారు
పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయంలో తమ్ముడుకు సలహా ఇస్తున్న కరీనా, కరీష్మ రన్‌బీర్ కు ఓ అమ్మాయిని వెతికిపెట్టారు. ఆమే కూడా బాలీవుడ్ హీరోయిన్ కావడం మరో విశేషం. తమ వదినగా తమ ఓటు సోనమ్ కపూర్‌కేనని వారు తేల్చి చెబుతున్నారు. ఆమె మాత్రమే రణ్‌బీర్‌కు సరైనదని, సోనమ్‌ను రణ్‌బీర్ పెళ్లి చేసుకుంటే చాలా ఆనందిస్తామని కరణ్‌జోహార్ షోలో వారు చెప్పారు. నిజానికి, సోనమ్‌కపూర్, రణ్‌బీర్ కపూర్ ఒకే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో సోనమ్, రణ్‌బీర్ కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత దూరం పెరిగింది. మరి, కరీనా, కరిష్మా అభిప్రాయాల గురించి వీరేమంటారో చూడాలి.