బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాల వివాహం మే 8న జరగనున్న సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో ఉన్న జుహూ నివాసంలో ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు వివాహం జరుగనుందని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు అందరు పెళ్లి వేడుకకి హాజరు కానున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్న ఈ పెళ్ళికి ప్రతి ఒక్కరు సంప్రదాయ దుస్తులలోనే రానున్నారని అంటున్నారు.
ఈ వేడుక కంటే ముందు జరిగే మెహందీ, సంగీత్ పార్టీలు ముంబైలో గ్రాండ్‌గా జరిగాయి. మెహందీ సెర్మనీలో వధువు సోమన్ కపూర్ అదిరిపోయే లుక్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ వేడుకలో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల ఈ సెలబ్రేషన్స్‌కు హాజరై సందడి చేశారు. కాగా, పలువురు అభిమానులు శ్రీదేవి లేని లోటు ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
అందరు పలు బాలీవుడ్ మూవీలోని సాంగ్స్‌కి స్టెప్పులేశారు. ప్రస్తుతం సోనమ్-ఆహుజాల సంగీత్, మెహందీ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత సోనమ్ తన తాజా చిత్రం వీరే ది వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొననుంది . ఈ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. మరోవైపు సంజూ చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్న సోనమ్ మే 14, 15 తేదీలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై నడవనున్న సంగతి తెలిసిందే.