బాలీవుడ్ స్టార్ హీరోయిన్‏కి క్యాన్సర్..

269
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలిపింది. క్యాన్సర్ తీవ్ర స్థాయిలో ఉందని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ మధ్య ఆరోగ్యం సహకరించక ఆస్పిటల్ కి వెళ్లానని, అదే పనిగా నొప్పి వేధిస్తుండడంతో పరీక్షలు నిర్వహించుకున్నానని, ఊహించని విధంగా క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని చెప్పింది. హై గ్రేడ్ క్యాన్సర్ ఉందని, ఇది శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపించిందని చెప్పారు.

sonali-bendre

ఈ వార్త విని తాను జీవితంపై ఆశను కోల్పోలేదని, వ్యాధిపై పోరాటం చేస్తానని చెప్పింది. అయితే తనకు అండగా ఉండి.. ధైర్యం చెప్పిన బంధువులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపింది. చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లానని, డాక్టర్ సలహాల, సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ఈ వార్త విన్న ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

తన నటన, అందంతో కోట్లాది మంది అభిమానులను సంపాధించుకున్నారు బింద్రే. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు ఏర్పర్చుకున్నారు. మహేబాబు సినిమా మురారీ ద్వారా తెలుగు తెరపై పరిచయం అయిన ఈ భామ..అనంతరం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. చిరంజీవి సరసన ఇంద్ర, శంకర్ దాదా  ఎమ్ బీబీఎస్  సినిమాలతో మంచి గుర్తింపు ఏర్పర్చుకుంది.

- Advertisement -