బాయ్‌ ఫ్రెండ్‌తో దొరికిపోయిన హీరోయిన్‌..

219
Online News Portal
Sonakshi-Bunty Sajdeh spotted on a dinner date.
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రేమలో ఉందని కొన్ని రోజుల కిందట వదంతులు ప్రచారమయ్యాయి. అవన్నీ పుకార్లు, ట్రాష్ అంటూ కొట్టిపడేశారు ఈ జంట. తాజాగా ఈ జంట ఓ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లి మీడియాకు చిక్కారు. శుక్రవారం రాత్రి ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కు వచ్చిన సోనాక్షి, బంటీ.. కాసేపు రెస్టారెంట్‌లో గడిపారు. ఆ తరువాత గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుండి భయటపడాలని అనుకున్నారు. మొదట సోనాక్షి బయటకు వచ్చింది. సోనాక్షి వెళ్లిన కాసేపటి తరువాత బంటీ కూడా నవ్వుతూ బయటకు వచ్చాడు.

son

అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు సోనాక్షి సిన్హా హాజరయింది. ఇదే ఈవెంట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డే కూడా పాల్గొన్నాడు. దీంతో అందరిదృష్టి వీరిపై పడింది. స్పోర్ట్ అండ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి యజమాని అయిన బంటీతో బొద్దుగుమ్మ సోనాక్షికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. అయితే రెండు నెలల కిందట వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

sonakshi

సోనాక్షి, బంటీ మధ్య చాలాకాలంగా ప్రేమ నడుస్తున్నట్టు చెప్తున్నారు. ఆ మధ్య వీరు విడిపోయినట్టు కూడా కథనాలు వచ్చాయి. ప్రియుడు బంటీ పెళ్లి ప్రతిపాదనను సోనాక్షి అంగీకరించిందని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోనుందని ‘ముంబై మిర్రర్‌’ మ్యాగజీన్‌ ఓ కథనం రాయగా.. దానిని సోనాక్షి తోసిపుచ్చింది. అయితే, తమ మధ్య బ్రేకప్‌ అయిన వార్తలు వట్టివేనని కొట్టిపారేయడానికి సోనాక్షి, బంటీ ఇలా రెస్టారెంట్‌కు వచ్చినట్టు భావిస్తున్నారు. సోనాక్షి ప్రస్తుతం ఫోర్స్ 2 మూవీలో నటిస్తుంది. జాన్ అబ్రహాం, తాహిర్ షా, ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

bunty

- Advertisement -