ఆకట్టుకుంటున్న ‘సన్నాఫ్ ఇండియా’ టీజ‌ర్..

152
Son of India Teaser
- Advertisement -

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం టీజ‌ర్ హీరో సూర్య చేతుల మీదుగా విడుద‌లైంది. ‘మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే సె‌ప‌రేటు’ అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో ఈ టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతోంది. ‘తాను ఎప్పుడు ఎక్క‌డ ఉంటాడో, ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే ఎరుక’ అంటూ చిరంజీవి ఇచ్చిన వాయిర్ ఓవ‌ర్ ఆకర్షిస్తోంది.

‘నేను చీక‌టిలో ఉండే వెలుతురిని, వెలుతురులో ఉండే చీక‌టిని’ అంటూ మోహ‌న్ బాబు ఇందులో తనదైన శైలిలో డైలాగు చెప్పారు. ‘నేను క‌స‌క్ అంటే మీరంద‌రూ ఫ‌సక్’ అవుతారంటూ ఆయ‌న చివ‌ర్లో మ‌రో డైలాగు వ‌దిలారు. మోహన్ బాబు అనేక ర‌కాల లుక్‌ల‌లో క‌న‌ప‌డుతున్నారు. కాగా, ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

https://youtu.be/cemFQtgaMbA

- Advertisement -