- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యేఏ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌లో భాగంగా మూడు టీడీపీ ,ఒకటి జనసేన, ఒకటి బీజేపీకి దక్కగా బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు.
జనసే పార్టీ అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుండి బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మలను అభ్యర్థులగా ఎంపిక చేశారు.
నామినేషన్ల దాఖలుకు గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో టీడీపీ అభ్యర్థులతోపాటు సోము వీర్రాజు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. అన్ని స్థానాలూ ఏకగ్రీవం కానున్నాయి.
Also Read:ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.11,600 కోట్లు
- Advertisement -

