సోంపు రసంతో ఆరోగ్యం!

73
- Advertisement -

వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలలో సోంపు ముందు వరుసలో ఉంటుంది. వివిధ రకాల పిండి వంటల తయారీలోనూ, స్వీట్స్ తయారీలోనూ సోంపు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇంకా రుచికరమైన పాయసం తయారీలో సోంపు తప్పనిసరి. మంచి రుచికరమైన భోజనం చేసిన తరువాత సోంపు గింజలు నోట్లో వేసుకొని నమలకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. భోజనం చేసిన తరువాత కొద్దిగా సోంపు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. సోంపులో విటమిన్ సి, బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే సోంపు తిన్న తర్వాత కొన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఆయుర్వేదంలో కూడా సోంపును దివ్య ఔషధంలా పరిగణిస్తారు. .

ముఖ్యంగా సోంపును నేరుగా గింజల రూపంలో తీసుకోవడం కంటే.. రసం రూపంలో సేవిస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చిన తరువాత ఉదయం పూట పరగడుపున సేవిస్తే మలబద్దకం సమస్య దూరమవుతుంది. ఇంకా ఎసిడిటీతో బాధపడేవారు కూడా సోంపు రసం తాగితే ఆ సమస్య తగ్గిపోతుంది. ఇంకా సోంపు రసం నోట్లో వేసుకొని పుక్కిలిస్తే నోటి దుర్వాసన దూరమౌతుంది. ఇంకా తలనొప్పి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు సోంపు రసాన్ని టీ రూపంలో సేవిస్తే ఆ సమస్యలన్నీ దురమౌతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా సోంపులో ఉండే ఔషధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయట. కాబట్టి సోంపు రసం ప్రతిరోజూ సేవించిన మంచిదే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:‘పొట్టేల్’ …అనన్య నాగళ్ల బర్త్ డే స్పెషల్

- Advertisement -