ఎగరలేని పక్షులివే

625
- Advertisement -

ఈ భూమి మీద జంతువులు పక్షులు మృగాలు సమస్త జీవకోటి తమ మనుగడను సాగిస్తాయి. కొన్ని సందర్భాల్లో వాటి స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకొని జీవిస్తుంటాయి. దానికి కారణం ప్రత్యేక వాతవరణంగా చెప్పవచ్చును. నీటిలో ఈదే జంతువులు నీటిలోనే ఈదుతాయి. అవి నేలపై ఏం చేయలేవు.

పక్షులు కూడా గాలిల్లో ఎగురుతూ సుదూరం ప్రయాణించి వాటికి కావాల్సిన ఆహారంను సేకరించుకుంటాయి. కానీ కొన్ని పక్షులు మాత్రం అస్సలు ఎగురలేవు ఎందుకంటే అవి బరువుగా ఉండటం వాతవరణ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం జంతు జన్యు శాస్త్రంలో ముఖ్యమైన మార్పులు కలిగి ఉండటం వల్ల పక్షులు ఎగురలేవు. అవేంటో చూద్దాం కాసోవరీ, పెంగ్విన్, కాకపో, నందు, ఈము, ఉష్ట్రపక్షి ఈజాబితాలో ఉన్నాయి.

కాసోవరీ
ఆస్ట్రేలియన్ కాసోవరీ భూమిపై రెండవ అత్యంత బరువైన పక్షిగా గుర్తించబడింది, దీని గరిష్ట బరువు 85 కిలోల వరకు ఉంటుంది. స్త్రీ కాసోవరీ కంటే మగ కాసోవరీ చాలా చిన్నవిగా ఉంటాయి. స్త్రీ కాసోవరీ దాదాపుగా మగవారి కంటే రెండు రెట్లు పెద్దవిగా కనపడతాయి.

పెంగ్విన్‌
పెంగ్విన్‌లు జలచరాలు మరియు దృవప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి ఎగిరే పక్షుల నుండి ఉద్భవించిన ఇవి ఎగురలేవు దానికి కారణం వీటి రెక్కలు చాలా చిన్నగా ఉండటమే.

కాకపో
కాకాపో న్యూజిలాండ్‌ లో మాత్రమే కనపడతాయి. ఇవి చిలుక జాతికి చెందినవిగా గుర్తించారు. ఇవి ఎక్కువగా రాత్రిపూట ఆహారం సేకరించుకుంటాయి. మరియు ఎగరలేనివి.

Also Read:10 రాష్ట్రాలకు విస్తరించిన గ్రీన్ ఛాలెంజ్..

నందు
నందు అనే పక్షులు దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా బొలీవియా బ్రెజిల్ పరాగ్వే ఉరుగ్వేలలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా గడ్డి భూములు సవన్నాలు గడ్డితో కూడిన చిత్తడి నేలలలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా 20 నుంచి 27కిలోగ్రాముల (44–60 పౌండ్లు) బరువును కలిగి ఉంటాయి.

ఈము
ఈములు ఎగరలేనివి కానీ చాలా బాగా పరిగెత్తే పక్షులు. ఈములు గంటకు 48కి.మీ వేగంతో పరుగెడతాయి. ఇవి ఎక్కువగా మొక్కలు చిన్న చిన్న కీటకాలను తింటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వారాలు ఏమి తినకుండా జీవిస్తాయి. ఇవి చాలా అరుదుగా నీటిని తాగుతాయి. దీనిలో ఒక ప్రత్యేక గుణం ఉంది. ఈములు తినే కీటకాలు మొక్కల నుంచి నీటిని తాగి జీవిస్తాయి.

ఉష్ట్రపక్షి
ఉష్ట్రపక్షి భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. మరియు ఇది గంటకు 55 కి.మీ వేగాన్ని అందుకోగలదు. సాధారణంగా ఇది గరిష్ట భూమి మీద గంటకు 70 కి.మీల వేగంను అందుకొగలదు. ప్రపంచంలో అత్యంత పెద్దదైన అండం (గుడ్డు)ను కలిగి ఉంటుంది.

Also Read:GST బ్యూటీతో ఆర్జీవీ..ఫోటోలు వైరల్‌!

- Advertisement -