కవిత కు బెయిల్ పై కొందరు కాంగ్రెస్ నేతలు పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అన్నారు బీఆర్ఎస్ నేత సోమా భరత్ కుమార్. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల పై వ్యాఖ్యానించే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన భరత్….ఈ తీర్పు కు రాజకీయాలకు సంబంధం లేదు అన్నారు. కోర్టు ను కించపరిచేలా మాట్లాడితే కోర్టు ధిక్కరణ కేసులు వేస్తాం అన్నారు.
కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలన్నారు. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది…చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళామన్నారు. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోలేదు,బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు అన్నారు.
ఏపీ లో టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు,ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీ లో చేరిన ఎంతో మంది నేర చరితుల పై విచారణ జరగడం లేదు అన్నారు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు..కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అన్నారు. కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారు అని మండిపడ్డారు.
Also Read:ఆలస్యమైన న్యాయమే గెలిచింది..బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు