అవినాష్‌ ఫైర్‌…సొహైల్ కంటతడి!

243
avinash

బిగ్ బాస్ హౌస్‌లో ఫైర్ మెన్‌గా పేరు తెచ్చుకున్నారు సొహైల్. అయితే లాస్ట్ వీక్ నాగార్జున క్లాస్ పీకడంతో ఇంట్లో తన ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. తాజాగా ఎంత కోపం వచ్చిన అనుచుకుంటున్న సొహైల్ హౌస్‌లో తొలిసారి కంటతడి పెట్టుకున్నారు.

కెప్టెన్‌గా అమీతుమీ టాస్క్‌గా సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు అవినాష్‌. అయితే టాస్క్‌లో భాగంగా సొహైల్‌…అఖిల్ టీంకు సపోర్ట్ చేస్తున్నారని ఆవేశంతో ఉగిపోయాడు అవినాష్. కెప్టెన్‌గా సొహైల్‌ పనికిరాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దివి ట‌బ్‌లో నుంచి ఒక‌సారి దిగిన‌ప్పుడు కూడా ఏమీ చేయ‌లేద‌ని చిన్నపిల్లలకు చెప్పినట్లు చెబుతున్నావని సంచాల‌కుడిగా నువ్వు క‌రెక్ట్ కాద‌ని చెప్పాడు. ‌ఇలానే జ‌రిగితే నేను టాస్కులు ఆడ‌ను, కావాలంటే ఎలిమినేట్ చేసేయండి, నాకు క్లారిటీ లేక‌పోతే బాగోదు అని వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సొహైల్ బాత్రూమ్‌లోకి వెళ్లి కుర్చిని గుద్దాడు. దీంతో సొహైల్‌ని ఓదార్చుతూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు మెహబూబ్,అఖిల్. నాగ్ స‌ర్‌కు ప్రామిస్ ఇచ్చినందుకే తాను అర‌వ‌ట్లేదు అని కంటతడి పెట్టారు. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఏడూస్తూనే ఉండిపోయాడు సొహైల్. జ్వరం వచ్చినా టాస్క్‌లు కొనసాగాలనే నిలబడ్డానని కానీ తననే అందరూ అంటున్నారని బాధపడగా అవినాష్ దగ్గరకు వచ్చిన తాను ఏం అన్నానో మరోసారి వివరించే ప్రయత్నం చేశాడు. మొత్తంగా హౌస్‌లో యాంగ్రీ యంగ్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న సొహైల్ చిన్నపిల్లాడిలా ఏడవడం అందరిని ఆశ్చర్య పరిచింది.