రాందేవ్‌ కన్నా ఎక్కువ చూపిస్తున్నానా..!

292
- Advertisement -

సోఫియా హయత్…తన అందచందాలు,గ్లామర్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఉర్రూతలుగించింది. మోడల్‌గా, నటిగా యూత్‌కు కంటిమీద కునుకు  లేకుండా చేసింది. బిగ్ బాస్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొని అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. సడన్‌గా ఏమి జరిగిందో తెలియదు గానీ..హాట్ మోడల్ నుంచి కూల్ సన్యాసినిగా మారిపోయి ఆమధ్య వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సోఫియా హయత్.. తన సోషల్ మీడియా పోస్టులతో మరోమారు వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.

sofia

తన కామెంట్స్ లో బాబా రాందేవ్ పై సెటైర్లు వేయడంతో విషయం కాస్త మరింత చర్చనీయాంశంగా మారింది. తన పాత రోజులను మళ్లీ గుర్తు చేసుకుందో మరేమో గానీ గతంలో తాను దిగిన కొన్ని హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లోయర్‌ బ్యాక్‌ ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు విసిరారు. సన్యాసిగా మారిన తర్వాతా.. ఇలాంటి చేష్టలేంటని కొందరు తప్పుపట్టారు. వారికి సమాధానమిచ్చే విధంగా మళ్లీ ఓ పిక్చర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.

sofia-hayat-bikini-photo

తెల్లటి బాత్‌రోబ్‌లో ధ్యానం చేస్తున్న ఫొటో పోస్ట్ చేసి ఒక ప్రసంగం వినిపించింది. ”దైవత్వ వెలుగుగా మారడానికి మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. శరీర ప్రదర్శనను విమర్శించే వారికో విషయం చెప్పాలి.. నేను ఇప్పటికీ బాబా రామ్‌దేవ్‌ కంటే ఎక్కువ దుస్తులే వేసుకున్నా” అంటూ సందేశం పెట్టింది.

sofia-hayat

సృష్టికి సంబంధించి ప్రతీ మహిళ పవిత్రతను సంతరించుకున్నదే అని, రుతుస్రావమనేది కూడా పవిత్రతో ముడిపడి ఉన్నదే అని.. ఆ విషయాన్నేదో దాచి ఉంచాల్సిన పరిస్థితిని కల్పించారని, పైగా అపరిశుభ్రం అంటూ నెగటివ్ కామెంట్స్ చేయడమేంటని సోఫియా గట్టిగానే ప్రశ్నించింది. అలాంటి ఆలోచనలు ఉన్నవారెవరైనా వెంటనే బుర్రలోంచి వాటిని తొలగించుకోవాలని హితవు పలికింది.

sofia yoga

2012లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు..అతనికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2013లో బిగ్‌బాస్ 7వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోటీ పడింది. బ్రిటీష్ జాతీయురాలిగా ఓ ప్రముఖ మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా, సన్యాసినిగా మారిన తర్వాత సోఫియా హయత్ తన పేరును గియా సోఫియా మదర్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే.

hayath

sofia yoga

sofia jeans

sofia yoga still

- Advertisement -