- Advertisement -
విశాఖను మంచుదుప్పటి కప్పేసింది. ఎన్నాడు లేని విధంగా ఏజెన్సీ ప్రాంతంగా తలపిస్తుంది విశాఖ సిటీ. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా జనజీవనం స్తంభించిపోయింది. అయితే పర్యాటక ప్రియులను మాత్రం ఆకట్టుకుంటోంది మంచు దుప్పటి.
పొగమంచుతో విశాఖ మహనగరాన్ని కప్పేయగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కనీసం 5 మీటర్లు దాటి రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. పూర్తి స్థాయిలో పొగమంచు కప్పేయడంతో రోడ్ల పైకి మంచు వాతావరణాన్ని ఆస్వాధిస్తున్నారు ప్రజలు.
- Advertisement -