గురక అనేది చాలమందిని వేదించే సమస్య. నిద్రలో వారికి తెలియకుండానే అధిక శబ్ధంతో గురక పెడుతుంటారు చాలమంది. దీని కారణంగా పక్కన ఉన్న వారికి కూడా ఎంతో ఇబ్బంది కరంగా ఉంటుంది. అయితే ఈ గురక సమస్య స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో అధికంగా ఉంటుంది. నిద్రలో ఊపిరి ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు గాలి ప్రయాణించే మార్గంలో ఏమైనా అవరోధాలు ఏర్పడితే గురక వస్తుంది. ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే నోటి ద్వారా గాలి ఊపిరితిత్తులకు చేరే మార్గం సన్నగా ఉండడం వల్ల గురక ఏర్పడుతుంది. ఈ గురకలో రెండు రకాలు ఉన్నాయి.
ఒకటి పాథలాజికల్ గురక, మరోటి ఫియోలాజికల్ గురక. అయితే ఫియోలాజికల్ గురక సాధారణంగా అప్పుడప్పుడు కొందరిలో వస్తుంది. దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ఫాథలాజికల్ గురక అలా కాదు. ఈ సమస్య వల్ల కొన్ని సందర్భాలో నిద్రలోనే శ్వాస ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేసే వారిలో అధికంగా ఈ గురక సమస్య ఉంటుంది. అందువల్ల గురకను నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫాథలాజికల్ గురక వల్ల ఓబిసిటీ, బీపీ, గుండె సంబంధిత రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందట. అందువల్ల మనం సాధారణంగా భావించే గురక ఎన్ని ప్రమాదాలకు సంకేతమో అర్థం చేసుకోవచ్చు. అయితే గురక సమస్యను వైద్యంతో పాటు కొన్ని వంటింటి చిట్కాల ద్వారా కూడా నయం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అర టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి నిద్ర పోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా ఒక గ్లాస్ వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తగిన గురక నుంచి విముక్తి లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి…