జనాభా తగ్గాలంటే ఆ పనిచేయండి:రాందేవ్

276
Yog Guru Baba Ramdev
- Advertisement -

జనాభా నియంత్రణపై యోగా గురువు రాందేవ్‌ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడిన రాందేవ్‌ దేశంలో అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఓటు హక్కును తొలగించాలని అన్నారు.

అంతేకాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటి వాటిని తొలగిస్తేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. హిందూ, ముస్లిం భేదాలు లేకుండా ఎవరైనా ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వారికి ఇది తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాందేవ్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు.గతంలో ఒకరి కంటే ఎక్కువ మంది తోబుట్టువులు ఉండేవారికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓటు హక్కును కూడా తొలగించాలంటూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -