పామే పెళ్లాం…

213
snake wife
- Advertisement -

పామును చూడగానే ఒళ్ళు జలదరించడం, భయం కలగడం సహజమే.. ఇక అది కాటు వేసిందంటే గుండె ఆగినంత పని అవుతుంది..! పాముల పట్ల మనకున్న భయం వల్లే యిలా జరుగుతుంది.. మనం పామును చూస్తే ఎలా భయపడతామో.. అంతకు రెట్టింపు భయం దానికి మనల్ని చూస్తే కలుగుతుంది. కానీ అలాంటి పామును పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే.

PET SNAKE he believes is his dead girlfriend reincarnated

పాములో తన భార్యను చూసుకుంటు పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. అందుకు సాక్ష్యమే ఈ ఫొటోలు. థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి 10 అడుగుల పొడవున్న పామును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడమే కాదు ఇద్దరూ కలిసి టీవీ చూడటం, పార్కులకు వెళ్లడం.. ఇలా అన్ని చోట్లా జంటగా కనిపిస్తూ.. అందరూ నోరెళ్లబెట్టేలా చేస్తున్నారట. ఈ ఫొటోలను థాయ్‌లాండ్‌కు చెందిన వరానన్ అనే వ్యక్తి నెట్లో పెట్టాడు.

snake wife

పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఈ న‌వ‌జంట హ‌నీమూన్‌కు సింగ‌పూర్‌ కూడా వెళ్లొచ్చార‌ట‌. తనకా యువకుడు తెలుసునని.. వారిద్దరూ చాలా అనోన్యంగా ఉంటారని చెప్పాడు! చనిపోయిన మనుషులు జంతువుల రూపంలో తిరిగి జన్మిస్తారనే సిద్ధాంతాన్ని సదరు వ్యక్తి బలంగా నమ్ముతాడని.. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాడని వరానన్ తెలిపాడు. ఆ పామును చూస్తుంటే.. అచ్చం ఐదేళ్ల క్రితం చనిపోయిన తన ప్రేయసి లాగానే ఉందని.. అందుకే దాన్ని పెళ్లి చేసుకున్నానని చెబుతున్నాడు.

snake wife

PET SNAKE he believes is his dead girlfriend reincarnated

PET SNAKE he believes is his dead girlfriend reincarnated

- Advertisement -