ఒకే గురుకులం…ఆరుగురికి పాము కాటు!

0
- Advertisement -

తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థుల బాధ వర్ణణాతీతంగా ఉంది. ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసింది పాము. జగిత్యాల పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్విత్‌కు పాము కాటు వేసింది.

వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి వద్యార్థులను తరలించింది సిబ్బంది. నిన్ననే ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని కరిచింది పాము. ఈ ఘటన జరగక ముందే మరో ఇద్దరిని కాటేసింది పాము. ఇద్దరు విద్యార్థులకు కొనసాగుతుంది చికిత్స. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. మొత్తంగా ఇదే పాఠశాలలో ఆరుగురిని పాము కాటేయగా ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు.

Also Read:పసుపు తాడుతో సినిమా ప్రమోషన్స్‌లో!

- Advertisement -