- Advertisement -
ప్రస్తుతం సెల్ఫీ అంటే తెలియని వారు ఉండరేమో.. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు సెల్‌ఫోన్‌లో సెల్ఫీ అంటే పడిచస్తారు. ఒక్కోసారి ఆ సెల్ఫీ వల్ల ప్రాణాలు కూడా పోతుంటాయి. అయినా సభ్య సమాజంలో ఎలాంటి మార్పు లేదు. వినాశకాలే విపరీత బుద్ది అన్నారు.. మన పెద్దవారు. అలాగే ఇక్కడ జరిగిన సంఘట తెలిస్తే మీకే అర్థమౌతుంది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఓ యువకుడు పాముతో సెల్ఫీ దిగాలనుకుని తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పాముల ప్రదర్శనతో జీవనం సాగించే వ్యక్తి వద్ద ఉన్న సర్పాన్ని యువకుడు మెడలో వేసుకుని ఫోటో దిగడానికి యత్నించాడు. ఈ క్రమంలో పాము కాటువేయడంతో సదరు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
- Advertisement -