జై భీమ్ వర్సెస్ పుష్ప..నానిపై ట్రోలింగ్‌!

33
- Advertisement -

69వ జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుక టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్‌గా మారింది. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇక ఇదే సమయంలో అందరిని ఆకట్టుకున్న జై భీమ్‌ వంటి సినిమాకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఈ సినిమాలో సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు రాగా అవార్డుల వేడుకలో మాత్రం వెనుకబడిపోయారు సూర్య.దీంతో ఇంతమంచి సినిమాను జ్యూరీ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై హీరో నాని కూడా తనదైన శైలీలో స్పందించారు. ఇన్‌స్టాలో జైభీమ్‌ అని ఓ హార్ట్ బ్రేక్‌ సింబల్‌ను పెట్టి తన అసహనాన్ని వెళ్లగక్కాడు. దీంతో నెటిజన్లు నానిని తూర్పారబడుతున్నారు. నాని గతంలో కొన్ని ఆడియో ఫంక్షన్‌లలో మాట్లాడిన మాటలను షేర్ చేస్తూ తీవ్రంగా మండిపడుతున్నారు. పాన్‌ ఇండియా హీరో అంటే దుల్కర్‌ అని ఇలా గతంలో నాని చేసిన వ్యాఖ్యలను ఎడిట్‌ చేసి విమర్శలు గుప్పిస్తుండగా మరికొంతమంది నానికి మద్దతుగా నిలుస్తున్నారు.

Also Read:ఉదయాన్నే ఫ్రూట్స్ తింటున్నారా?

- Advertisement -