స్మార్ట్ ఫోన్స్ తో నైట్ టైం బి కేర్ ఫుల్.. ఆ టైంలో ఉపయోగాలకు మించి దుష్ఫలితాలుంటాయట. ముఖ్యంగా మన శరీరానికి ఆరోగ్యపరంగా కలిగే చెడే ఎక్కువ. వీటిలో నిద్రలేమి కూడా ముఖ్యమైన సమస్య. నిద్రకు,స్మార్ట్ ఫోన్స్ కి లింకేముంది అంటారా…? అయితే తెలుసుకుందాం.
ఇప్పుడు మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి కొత్త రకం స్మార్ట్ ఫోన్స్ ,టాబ్లెట్స్, ఇ-రీడర్స్ లో బ్లూ లైట్ ఎక్కువ. అందుకే ఎక్కువ కాంతివంతంగా ఉంటున్నాయి. అయితే అసలు సమస్య అంతా ఈ బ్లూ లైట్ వల్లే. కాంతి అనేది ఏడు వర్ణాల్లో వేరు వేరు తరంగ దైర్గ్యాలతో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీలో బ్లూలైట్ ఉపయోగిస్తారు. బ్లూ లైట్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అందుకే స్క్రీన్ ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. మనం రాత్రి పూట స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఫై ప్రభావం చూపుతుంది. మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. దీంతో మనం పడుకుంటే వెంటనే నిద్ర పట్టదు. ఒక గంట వరకు నిద్ర రాదు.
అయితే మంచి నిద్ర కోసం వైద్యులు నిద్రపోయే ఒక గంట ముందు స్మార్ట్ ఫోన్స్,టాబ్లెట్స్,ఇ-రీడర్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం స్మార్ట్ ఫోన్స్ కి రాత్రి వేళలో దూరంగా ఉండడమే మంచిది.