ఫోన్ అతిగా వాడితే.. ప్రమాదమే!

22
- Advertisement -

నేటి రోజుల్లో ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు ఫోన్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఫోన్ అతిగా వాడడం వల్ల కొన్ని సమస్యలు వెంటాడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఫోన్ అతిగా యూస్ చేసే వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఫోన్ అతిగా వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం !

కంటి సమస్యలు
ఫోన్ అతిగా యూస్ చేసే వారిలో కంటికి సంబంధించిన సమస్యలు వేగంగా ఉత్పన్నమౌతాయట. ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ ను చూడడం వల్ల కళ్ల మంటలు రావడం, దృష్టి లోపించడం, తరచూ కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా మొబైల్ అతిగా యూస్ చేయడం వల్ల చిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తుంది.

వెన్ను సమస్యలు
మొబైల్ ను అతిగా యూస్ చేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి వంటివి పెరిగే అవకాశం ఉంది. తరచూ మొబైల్ ను చేత్తో పట్టుకొని మెడ కిందకు వంచి చూడడం వల్ల మెడలోని నరాలు ఒత్తిడికి గురవుతాయి. తద్వారా మెడ నొప్పి సంభవిస్తుంది. అలాగే వెన్నెముకపై కూడా ప్రభావం పడుతుంది. ఇంకా ఒకే పొజిషన్ లో మొబైల్ పట్టుకొని యూస్ చేయడం వల్ల చేతినొప్పి ఏర్పడుతుంది..

మానసిక రుగ్మతలు
మొబైల్ ను ఎక్కువ సేపు యూస్ చేయడం వల్ల ప్రధానంగా మానసిక రుగ్మతలు వెంటాడుతాయి. మొబైల్ కు బానిసై ఒంటరి జీవితానికి అలవాటు అవుతారు. తద్వారా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన.. వంటి మానసిక రుగ్మతలు పెరుగుతాయి.

రేడియేషన్
మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ అవయవాల పని తీరును దెబ్బ తీస్తుంది. ఎక్కువ సేపు మొబైల్ ను యూస్ చేయడం లేదా మొబైల్ ను శరీరానికి దగ్గర ఉంచుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యం దేబ్బ తినడం, మెదడు పనితీరు మందగించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

కాబట్టి వీలైనంత వరకు మొబైల్ ను పరిమితి మేర మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !

- Advertisement -