నందమూరి బాలకృష్ణ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పైసా వసూల్”. సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం జనాలకు ఎక్కలేదు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 35 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో తొలి 5 రోజుల్లో ఈ సినిమా 14 కోట్ల 29 లక్షల షేర్ ను వసూలు చేసింది. ఇక అమెరికాలో కేవలం 42 లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే పెట్టిన పెట్టుబడిలో సగానికి తక్కువగానే వసూళ్లు వచ్చాయి. మరో వారం రోజుల పాటు ఈ సినిమా థియేటర్స్ లో వుండే అవకాశం వుంది. అప్పుడు కూడా వసూళ్లు 16 .. 17 కోట్ల వరకూ మాత్రమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి ఈ సినిమా ఆశించిన స్థాయిలో ‘పైసా వసూల్’ చేయలేదని తెలుస్తోంది.
సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే, సినిమాను కొన్న డిస్ట్రి బ్యూటర్లు బ్రేక్ ఈవెన్ పాయింటును చేరుకోవాలంటే రూ. 35 కోట్లు వసూలు చేయాలని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన భవ్య క్రియేషన్స్ అధినేత ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలో రూ. 9.5 కోట్లు వచ్చాయని, డబ్బింగ్ రైట్స్, ఇతర రైట్స్ కలిపి రూ. 4 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తోంది. సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 32 కోట్లకు అమ్మారు. ఇక సేఫ్ జోన్లోకి రావాల్సింది ఆయా ఏరియాల్లో సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లే.

