స్లోవేకియా ప్రధానిపై కాల్పులు

25
- Advertisement -

స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫికో పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు భద్రతా సిబ్బంది. రాబర్ట్ ఫికో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

హాండ్లోవా పట్టణంలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమానికి రాబర్ట్‌ ఫికో హాజరు కాగా హౌస్‌ ఆఫ్‌ కల్చర్‌ భవనం బయట ఫికోపై దుండగుడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఫికో కడుపులో తీవ్ర గాయం కాగా యూరోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు మూడు వారాల ముందు స్లొవేకియాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Also Read:TTD:17 నుండి పద్మావతి పరిణయోత్సవాలు

- Advertisement -