పని వేళల్లో నిద్ర ఆపుకోలేకపోతున్నారా..అయితే!

6
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అయితే కొంతమందికి పని ఒత్తిడి కారణంగా కూడా రాత్రివేళల్లో నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఫలితంగా ఆఫీసులకు వెళ్లగానే నిద్ర అస్సలు ఆగదు. ఇది ఎంతో చిరాకకు తెప్పిస్తుంది.

మనం ఆరోగ్యంగా ఉండడానికి కనీసం 6 గంటల సుఖనిద్ర అవసరం. అందువల్ల నిద్ర సమయం ఏ మాత్రం తగ్గిన ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కళ్ళు ఎర్రబడడం, రోజంతా బద్దకంగా ఉండడం, శరీరం నీరసంగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు నిద్రలేమి కారణంగా మనలను చుట్టుముడతాయి.

రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణం. భోజనం చేసిన 3 నుంచి 4 గంటల తరవాత నిద్రకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు. లేట్‌ నైట్స్‌ ఏ ఆహారం అయినా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. ముఖ్యంగా తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also read:గుడి గుడికో ఓ జమ్మి చెట్టు

ఆల్కహాల్‌ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమితో శరీర ఆరోగ్యవ్యవస్థ మీద ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలు, టీలు రాత్రి వద్దు : కాఫీ, టీల్లొ ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

- Advertisement -