లేటుగా నిద్రపోతున్నారా..జర జాగ్రత్త!

266
- Advertisement -

అతి నిద్ర ఆరోగ్యానికే కాదు మీ సంసార జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. దీనికి సంబంధించిన అధ్యయనంలో  మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు.

వీర్యం మగాడికి చాలా విలువైంది. అది లేనిదే మనిషి పుట్టుక లేదు అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఈ రోజుల్లో అర్దరాత్రి దాకా ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ల అధికవాడకం, టీవీ చూసుకుంటు కూర్చుంటే సరిపోయేంత నిద్ర ఉండటం లేదు. సరైన నిద్ర లేకపోతే స్ట్రెస్‌తో సెక్స్ సమస్యలు, వీర్య కణాల కౌంట్ తరుగుదల సంభవిస్తుంది.

ఈ అధ్యయనంలో భాగంగా ఇదే విషయం స్పష్టమైంది. కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు. అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది.

6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:విషపు పుట్టగొడుగులను గుర్తించడమెలా?

పొద్దున్న లేస్తూనే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకోకుండా ఒక వాటర్ బాటిల్ పట్టుకోవాలి. నీళ్లు ఎంత ఎక్కువ తాగితే వీర్యం అంత బలంగా తయారవుతుంది. అలాగే మద్యం కూడా కూడా శరీరానికి ఎంతో హానికరం. ఇక వీర్యానికి కూడా మద్యం బద్ద శత్రువు. మీ పిల్లలకు ఆరోగ్యకరమైన జీన్స్‌ను అందించాలంటే మీ అలవాట్లు బాగుండాలి. అందుకోసం సాధ్యమైనంత స్ట్రెస్ తగ్గించుకుని నీళ్లు ఎక్కువగా తాగుతూ పండ్లు ఎక్కువగా తీసుకుంటూ వ్యాయామం చేస్తూ మీ భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి.

 

- Advertisement -