SLBC Tunnel: సహాయక చర్యల్లో ప్రతిష్టంబన

1
- Advertisement -

నాగర్‌కర్నూలు జిల్లా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంబన కొనసాగుతున్నది. సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించింది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది.

లోపల ప్రమాదం జరిగిన తీరును ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్‌ను (మ్యాప్) తయారు చేశారు. దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు.

టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది. దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే కనీసం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు.

Also Read: ముఖ్యమంత్రిది దిగజారుడు రాజకీయం: కేటీఆర్

- Advertisement -