SLBC టన్నెల్..మృతదేహం వెలికితీత

18
- Advertisement -

SLBC టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యల్లో గుర్తించిన మృతదేహం పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్ సింగ్ s/o విర్స సింగ్ ,రాబిన్స్ ఇండియా కంపెనీ ఏరెక్టర్ ఆపరేటర్ గా గుర్తించినట్టు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్టు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక ఆంబులెన్స్ లో కార్మికుడి స్వస్థలానికి తరలించనున్నట్టు తెలిపారు.

శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించగా.. కాంక్రీట్‌ మాదిరిగా గట్టిపడ్డ మట్టిలోంచి.. దెబ్బతినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించాయి. మృతదేహం నిలువున ఉన్నట్లు గుర్తించి, 12 అడుగుల మేర తవ్వకాలు జరిపాయి.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాన్ని తీయగా.. 6 గంటలకు టన్నెల్‌ నుంచి బయటకు తీసుకువచ్చి, పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తవ్వగా.. మృతదేహాన్ని పంజాబ్‌కు తరలించారు.

Also Read:అప్పుందని తెలియదా?: కిషన్ రెడ్డి

- Advertisement -