రాష్ట్రానికి మరో విదేశీ కంపెనీ..వంద మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి

381
skyworthktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి విదేశీ కంపెనీల‌ వెల్లువ కొన‌సాగుతున్న‌ది. ఎలక్ట్రానిక్స్ కంపెనీ స్కైవర్త్ హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఎల‌క్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ రంగంలో మేటి అయిన స్కైవ‌ర్త్ సంస్థ సుమారు 100 మిలియన్ల డాల‌ర్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో త‌మ సంస్థ‌ను ప్రారంభించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. స్కైవర్త్ లీడర్షిప్ యొక్క ఉన్నత ప్రతినిధి బృందం మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఐటి మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో స్కైవర్త్ గ్రూప్ బోర్డు చైర్మన్ మిస్టర్ లై వీడ్ తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

స్కై వర్త్ కంపెనీ తెలంగాణాలో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దశల వారీగా పెట్టుబడులను పెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో 50 ఎకరాలలో అత్యాధునిక ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయబోతుంది. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగ పెట్టుబడి ఇది. సుమారు మూడు వేల మంది యువ‌త‌కు ఈ సంస్థ‌లో ఉద్యోగం క‌ల్పించ‌నున్నారు.

ఈ సందర్భంగా బోర్డు ఛైర్మన్ మిస్టర్ లై వీడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు అనుగుణంగా ఉన్నాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను లభిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం అన్నారు. స్కై వర్త్ ద్వారా అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు తీసుకురానుందని. స్థానిక ప్రజల నైపుణ్యాలను పెంచడనికి స్కైవర్త్ పనిచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి, టియస్ ఐఐసి ఎండీ నర్సింహ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -