చర్మం నల్లబడుతుందా..ఇలా చేయండి!

107
- Advertisement -

సాధారణంగా ఎండాకాలంలో ఎండల కారణంగా చర్మం నల్లబడుతూ ఉంటుంది. కానీ కొందరిలో సీజన్స్ తో సంబంధం లేకుండా చర్మ నిగారింపును కోల్పోతూ ఉంటారు. ఇంకా ఇతరత్రా ఆరోగ్య సమస్యల కారణంగా కూడా చర్మ నిగారింపు తగ్గుతుంది. అలాంటప్పుడు మార్కెట్ లో దొరికే రకరకాల క్రిములు వాడుతూ చర్మ కాంతిని మరింత పాడు చేసుకుంటూ ఉంటాము. కొన్ని రకాల రసాయనిక క్రిములు చర్మకాంతిని పెంచినప్పటికి సైడ్ ఎఫెక్ట్స్ కు కారణం అవుతుంటాయి. కాబట్టి సహజంగా చర్మకాంతిని పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆయుర్వేద వైధులు చెబుతున్నా దాని ప్రకారం కొన్ని రకాల సూచనలు, నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే నల్లగా మారిన చర్మం సహజసిద్దంగా కాంతిని సంతరించుకొని అందంగా కనిపించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు మరి అవేంటో తెలుసుకుందామా !

ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలోని అన్నీ అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. ఫలితంగా మానిసిక ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి.దాంతో సహజంగానే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఇంకా తాజా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి కూడా క్రమం తప్పకుండా తాగాలి. పండ్ల రసాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు చర్మకాంతిని పెంచడంలో సహాయ పడతాయి. ఇంకా నల్లద్రాక్ష గుజ్జు తేనెతో కలిపి ప్రతిరోజూ స్నానానికి ఒక అరగంట ముందు మొఖానికి రాసుకొని ఆ తరువాత స్నానం చేస్తే మొఖంపై పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.

తద్వారా మొఖం అందంగా తయారవుతుంది. ఇంకా బయటకు వెళ్ళే ముందు మొఖానికి సన్ లోషన్స్ రాసుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే సూర్యరశ్మి నుంచి చర్మం పాడవకుండా ఉండడానికి సన్ లోషన్స్ దోహదం చేస్తాయి. ఇంకా దుమ్ము ధూళి వంటివి కూడా చర్మ లోపలి పోరాల్లోకి వెళ్లకుండా ఈ క్రీమ్స్ అడ్డు పడతాయి. ఇంకా వివిధ రకాల చిట్కాల ద్వారా కూడా మొఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయ రసం మరియు అందులో కొద్దిగా తేనె కలుపుకొని మొఖానికి రాసుకొని 15 నిముషాల తరువాత చన్నీటితో కడిగేసుకుంటే మొఖం అందంగా తయారవుతుంది. కాబట్టి మార్కెట్ లో దొరికే రసాయనిక క్రీమ్స్ వాడి సమస్యలు తెచ్చుకునే కన్నా సహజసిద్దంగా ఇలాంటి చిట్కాలు, సూచనలు పాటించి మన మొఖాన్ని, చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

Also Read: కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

- Advertisement -