సినిమా కోసం.. ప్లేట్లు కడిగానంటున్న సూర్య..

236
SJ Suriya worked as Server in a Hotel
- Advertisement -

దర్శకుడు ఎస్ జే సూర్య అంటే తెలుగు,తమిళ ప్రేక్షకులకు పరిచయం చేయల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన ఖుషి చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన కొమురం పులి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. దాంతో కొంత కాలం తెలుగు సినిమాకు దూరమయ్యాడు. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో భైరవ పాత్రతో ప్రతినాయకుడిగా కనిపించారు. ఆ పాత్రకు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న ఎస్.జె.సూర్య ఒకప్పుడు హోటల్లో సర్వర్ గా పని చేస్తూ ప్లేట్లు కడిగేవాడట. కడుపు నింపుకోవడం కోసం తాను ఇంకా చాలా పనులే చేసినట్లు అతను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

SJ Suriya worked as Server in a Hotel

అయితే తన కుటుంబంలో అందరూ చాలా బాగా చదువుకుని లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారని తనకు మాత్రం చిన్నప్పట్నుంచి సినిమాలపై ఆసక్తితో సినీ రంగానికి వచ్చేసినట్లు చెప్పాడు సూర్య. శివాజీ గణేషన్ ను కలిసి తన గురించి చెబితే నటుడిగా అవకాశం ఇస్తారనుకుని పల్లెటూరి నుంచి చెన్నైకి వచ్చానని.. కానీ ఇక్కడికొచ్చాకే సినిమాల్లో అవకాశం ఎంత కష్టమో అర్థమైందని అన్నాడు సూర్య. జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం లభించినా నెలలో నాలుగు రోజులకు మించి పని ఉండేది కాదని అలాంటి పరిస్థితుల్లో తాను హోటల్లో సర్వర్ గా పని చేసినట్లు సూర్య వెల్లడించాడు.

అలా పని చేసుకుంటూ సినిమాల్లోనూ ప్రయత్నాలు చేశానని.. ఓ సినిమాకు చాలా కష్టపడి పని చేయడం చూసిన అజిత్.. తనకు అవకాశం ఇవ్వాలనుకున్నారని.. నాలుగేళ్ల తర్వాత ఆయన పిలిచి అవకాశమిస్తే ‘వాలి’ కథ వినిపించానని సూర్య చెప్పాడు. ఆ సినిమాను అనేక ఇబ్బందుల మధ్య చేశామని.. అది బ్లాక్ బస్టర్ కావడంతో తన జీవితం మలుపు తిరిగిందని.. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది అజిత్ పెట్టిన భిక్షే అని సూర్య చెప్పాడు.

- Advertisement -