శివకార్తికేయన్‌ ‘శక్తి’ ట్రైలర్‌..

278
Sivakarthikeyan
- Advertisement -

ద‌ర్శ‌కుడు పి.య‌స్‌. మిత్ర‌న్‌ డైర‌క్ట్ చేసిన లేటెస్ట్ త‌మిళ మూవీ `హీరో` తెలుగులో ‘శక్తి ..ది సూపర్ హీరో’పేరుతో విడుద‌ల కానుంది. తమిళ హీరో శివ కార్తికేయ‌న్ ఇందులో హీరోగా న‌టించారు. యాక్షన్ కింగ్‌ అర్జున్ కీల‌క పాత్రధారి. బాలీవుడ్ న‌టుడు అభ‌య్ డియోల్‌కి సౌత్ ఇండియాలో తొలి నటిస్తున్న సినిమా ఇదే. శివ కార్తికేయ‌న్ కెరీర్‌లో సామాజిక స్పృహ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రిజిస్టర్ అయింది ఈ మూవీ. కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. కోటపాడి జె రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ నాయిక‌. ఇవాన కీల‌క పాత్ర‌లోన‌టించారు.

sakthi

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. యాక్షన్‌, ఎమోషన్‌, డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. మార్చి 20న సినిమా విడుదల కానుంది.

- Advertisement -