శివకార్తికేయన్‌ @మిస్టర్‌ లోకల్‌

276
siva nayan
- Advertisement -

రెమో సినిమాతో ప్రేక్షకుల్లో మంచిపేరుతెచ్చుకున్న హీరో శివకార్తికేయన్‌. తాజాగా రాజేశ్‌ దర్వకత్వంలో నయనతార హీరోయిన్‌గా సినిమా చేస్తున్నారు కార్తికేయన్. ఆయన 13వ చిత్రంగా తెరకెక్కుతుండగా స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నయన్-శివకార్తీకేయన్ రెండోసారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి ‘మిస్టర్‌. లోకల్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. ఈ సినిమాలో పక్కా లోకల్‌ కుర్రాడిగా శివకార్తికేయన్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు నచ్చేలా కమర్షియల్‌ హంగులతో దీన్ని రూపొందిస్తున్నామని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. త్వరలో సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాతో పాటు ‘ఇండ్రు నేట్రు నాలై’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శివకార్తికేయన్‌ ఇందులో శాస్త్రవేత్త పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని టాక్‌. ఓ వైపు హీరోగా వరుస సినిమాలకు కమిట్ అవుతునే మరోవైపు నిర్మాణ రంగంపై దృష్టిసారించారు కార్తికేయన్‌.

- Advertisement -