ఆ హీరోకు కీర్తి సురేష్ బోర్ కొట్టేసిందట..!

283
- Advertisement -

కీర్తీ సురేశ్… ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తమిళ సినిమాల ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..హీరోయిన్‌గా ఎదిగే సమయంలో.. అక్కడ శివ కార్తికేయన్ తో వరుసగా రెండు సార్లు జోడి కట్టింది. వీళ్ల ఇద్దరి కాంబినేషన్‌ కు కోలీవుడ్ ప్రేక్షకులనుంచి మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా శివ కార్తికేయన్ విషయంలో కీర్తి చేసిన కామెంట్స్ చాలామంది ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆ హీరోకు తాను బోర్ కొట్టేశానని కీర్తి కామెంట్ చేసిందట.

Sivakarthikeyan and Keerthy Suresh

రీసెంట్ మూవీ రెమో తరువాత ఇద్దరి కాంబినేషన్‌కు గ్యాప్ రావడానికి కారణం ఇదేనేమో అని చెప్పిందట కీర్తీ. అయితే అమ్మడు మాటలు వింటుంటే… తనకే శివ కార్తీకేయన్‌తో కలిసి నటించడం బోరింగ్ గా ఉందేమోనని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తుండడంతో.. చిన్న హీరోలను కీర్తి ఇక పక్కన పెట్టేసినట్లేనని చెబుతున్నారు. టాలీవుడ్ లో ఇంకా నిలదొక్కుకునే స్టేజ్ లోనే ఉన్న కీర్తి… పవన్ కల్యాణ్, మహేష్ తో నటించాక ఇంకా ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చూడాలి.

- Advertisement -