నయన్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు!

17
- Advertisement -

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్..వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే. చంద్రముఖి చిత్రంలోని కొన్ని సన్నివేశాలను వాడుకున్నందుకు నయన్‌ సహా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌కు రూ.5 కోట్లు చెల్లించాలంటూ లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు కథనాలు దీనిపై చంద్రముఖి సినీ నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్‌ స్పందించింది.

నయన్‌కు తాము ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని సదరు నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తమ పర్మిషన్ తీసుకొనే వినియోగించుకున్నారని స్పష్టం చేసింది. మొత్తం 17 సెకన్ల సన్నివేశాలను రౌడీ పిక్చర్స్ సంస్థ వాడుకోవచ్చని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎక్స్ ద్వారా స్పష్టం చేసింది నిర్మాణ సంస్థ.

 

Also Read: KTR: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్!

- Advertisement -