‘రెమో’ ఫస్ట్ లుక్

266
- Advertisement -

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. ఫ‌స్ట్‌లుక్‌ను ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి విడుద‌ల చేశారు. సాంగ్‌ను వంశీపైడిప‌ల్లి విడుద‌ల చేశారు.

వంశీ పైడి ప‌ల్లి మాట్లాడుతూ – “హీరో శివ‌కార్తికేయ‌న్ ను హీరోయిన్‌గా చూపించ‌డానికి ద‌ర్శ‌కుడు ఎంత క‌ష్ట‌ప‌డి ఉంటాడో నాకు తెలుసు. అనిరుధ్ మ్యూజిక్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మంచి వ్య‌క్తులు క‌లిస్తే మంచి విజ‌యాలు వస్తాయ‌న‌డానికి రెమో లాంటి సినిమాయే ఉదాహ‌ర‌ణ‌. శివ‌కార్తికేయ‌న్ మూడేళ్ళ‌లో హీరో త‌నెంటో ప్రూవ్ చేసుకోవ‌డ‌మే కాదు, త‌న సినిమా కోసం ఇప్పుడు త‌మిళ‌నాడులో అందరూ ఎదురుచూస్తున్నారు. రెమో తెలుగులో శివ‌కార్తికేయ‌న్‌కు మంచి ఎంట్రీ అయ్యి తెలుగులో కూడా శివకార్తికేయ‌న్ స‌క్సెస్‌ఫుల్ హీరో కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

remo

అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “దిల్‌రాజు స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా రాణిస్తున్నారు. ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌స్తున్న రెమో సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. త‌మిళంలో క‌ష్ట‌ప‌డి అతి త‌క్కువ స‌మ‌యంలోనే హీరోగా ఎదిగిన శివ‌కార్తీకేయ‌న్ సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రీమేక్ అవుతూ వ‌చ్చేవి. కానీ తొలిసారి రెమో సినిమాను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ‌కార్తికేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్ చూసిన నేను వెర‌వ‌రో హీరోయిన్ అనుకున్నాను. శివ‌కు లేడీ గెట‌ప్ అంత బాగా సరిపోయింది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్ రెమోతో తెలుగులో మంచి హీరోగా పేరు సంపాదించుకుంటాడు“ అన్నారు.

remo

దిల్ రాజు మాట్లాడుతూ – “నేను నిర్మాత‌గా నా బ్యాన‌ర్‌లో 25 సినిమా చేస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాను రీమేక్ చేయ‌లేదు. అయితే రీసెంట్‌గా నేను శ‌త‌మానం భ‌వ‌తి అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు రాజా ర‌వీంద్ర రెమో త‌మిళ ట్రైల‌ర్ చూపించాడు. ట్రైల‌ర్ చూడ‌గానే నాకు న‌చ్చింది. తొలిసారి రెమో ట్రైల‌ర్ చూసి సినిమాను రీమేక్ చేయాల‌నిపించేంత‌గా ఇన్‌స్పైర్ అయ్యాను. త‌మిళంలో ఈ సినిమాను నేను ఒక్క‌డినే ప్రివ్యూ షో వేసుకుని చూసిన‌ప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, భాష తెలియ‌దు క‌దా, కాబ‌ట్టి నాకు ఎక్క‌డో డౌట్ వ‌చ్చింది, దాని వ‌ల్ల వెట్రి థియేట‌ర్‌లో ఆడియెన్స్ మ‌ధ్య సినిమా చూశాను. ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయ‌డం చూసి నాలో నమ్మ‌కం ఏర్ప‌డింది.
అయితే మాల మేడంగారి స‌పోర్ట్‌తో నిర్మాత రాజాగారు న‌న్ను వ‌చ్చి క‌లిసి ఈ సినిమాను తెలుగులో డ‌బ్ చేసి నా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుంద‌ని అన‌డంతో నేను కూడా హ్యాపీగా స‌రేన‌న్నాను. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు“ అన్నారు.

శివ‌కార్తికేయ‌న్ మాట్లాడుతూ – “తెలుగులోరెమో సినిమాను విడుద‌ల చేస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్‌. ఆయ‌న బ్యాన‌ర్‌లో వ‌చ్చిన బొమ్మ‌రిల్లు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒక‌ప్పుడు ఆ సినిమాకు నేను బాగా క‌నెక్ట్ అయ్యాను. దిల్‌రాజుగారి బ్యాన‌ర్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఈ సినిమాను ఓ ప‌రీక్ష‌లా భావిస్తున్నాం. అయితే దిల్రాజుగారి వంటి నిర్మాత టీచ‌ర్‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ రెమో ఎగ్జామ్‌ను మేం అంద‌రం తెలుగులో పాస్ అవుతామ‌ని భావిస్తున్నాను“ అన్నారు.

పి.సి.శ్రీరాం మాట్లాడుతూ – “తెలుగు, తమిళ సినిమాలు నాకు రెండు కళ్ళు లాంటివి. రెండు భాషా చిత్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను తెలుగులో చేసిన సినిమాలు త‌మిళంలోకి డ‌బ్ అయ్యాయి. అలాగే త‌మిళ సినిమాలు తెలుగులోకి డ‌బ్ అయ్యాయి. రెమో సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.
సతీష్ మాట్లాడుతూ – దిల్ రాజుగారి వంటి నిర్మాత‌గారి స‌హ‌కారంతో రెమో సినిమా తెలుగులో విడుద‌ల అవుతుండ‌టం చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ మాట్లాడుతూ – “తమిళంలో నా తొలి సినిమాగా విడుద‌లైన రెమో పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ రెమో చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. తెలుగులో కూడ రెమో నా తొలి చిత్రంగా విడుద‌లవుతుంది. సినిమా స‌క్సెస్ లో భాగ‌మైన శివ‌కార్తికేయ‌న్‌, నిర్మాత రాజ‌గారికి థాంక్స్‌. తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న దిల్‌రాజుగారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

అనిరుధ్ మాట్లాడుతూ – “రెమో తెలుగులో నాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ మంచి డెబ్యూ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా తెలుగులో ప‌రిచ‌యం అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌ను ప్రేక్ష‌కులు ఆశీర్విదించాలి. సాంగ్స్‌, సినిమాను పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను“ అన్నారు.

- Advertisement -