ఇటలీలో ఎమర్జెన్సీ విధించారు. తీవ్ర నీటి కరువు ఏర్పడటంతో ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర ఇటలీలో పోనది చుట్టూ ఉన్న ప్రాంతాలు బీడుభూములుగా మారయని అధికారులు తెలిపారు.
ఎమిలియా రోమగ్న, ఫ్రూలీ వెంజియా గులియా, లొంబార్డీ, పీడమాంట్, వెనిటో ప్రాంతాలకు ప్రత్యేక ఎమర్జెన్సీ నిధుల ప్యాకేజీ ప్రకటించారు. నీటి కొరత వల్ల ఇటలీ వ్యవసాయ ఉత్పత్తుల్లో 30 శాతం దిగుబడి తగ్గనున్నది. గడిచిన 70ఏళ్లలో ఎన్నడూ ఈరీతిలో ప్రజలు కరువు చూడలెదంటున్నారు.
ఉత్తర ఇటలీలోని మున్సిపాల్టీల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. ఊహించని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ స్థాయిలో వర్షం నమోదు కావడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. ఇటలీలో పో నది అత్యంత పొడువైనది. తూర్పు దిశగా సుమారు 650 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. నదిలోకి ఉప్పు నీరు ప్రవహిస్తోందని, దీంతో పో నది పరివాహాక ప్రాంతంలో ఉన్న పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.