దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, హను రాఘవపూడి, స్వప్న సినిమా ‘సీతా రామం’ సెకండ్ సింగిల్ ‘ఇంతందం’ లిరికల్ వీడియో విడుదల
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ‘సీతా రామం’ టీజర్‌తో మ్యాజికల్ కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎసెట్‌లో ఒకటిగా నిలుస్తుంది. మొదటి పాట ‘ఓహ్ సీతా హే రామా” సంగీత ప్రియులని అలరించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రెండో పాట- ఇంతందం ప్రోమోతో ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా లిరికల్ వీడియోను విడుదల చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హను రాఘవపూడి, మృణాళిని ఠాకూర్ , సంగీత విశాల్ చంద్రశేఖర్ , గేయ రచయిత కృష్ణకాంత్ పాల్గొన్నారు.
ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జోడి చూడముచ్చటగా వుంది. వారి కెమిస్ట్రీ మ్యాజికల్ గా వుంది. మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ దుస్తులలో చాలా అందంగా కనిపించారు. ఆమె నృత్య ప్రదర్శన కూడా మనోహరంగా వుంది. ఈ పాట విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన లవ్లీ మెలోడి మళ్ళీ మళ్ళీ వినాలనించేలా వుంది. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం మనసుని హత్తుకుంది.
♫ఇంతందం దారి మళ్లిందా
భూమిపైకే చేరుకున్నాదా
లేకుంటే చెక్కి వుంటారా
అచ్చు నీలా శిల్ప సంపద
జగత్తు చూడని మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి తరించి తపస్సిలా
నిషీధులన్నీ తలొంచే తుషారానివా ♫
పాట పల్లవిలో వినిపించిన సాహిత్యం మళ్ళీ మళ్ళీ పాడుకునేలా వుంది. ఎస్పీ చరణ్ పాటని చాలా మధురంగా ఆలపించారు.
సాంగ్ లాంచ్ మీట్ లో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఇది చాలా సవాల్ తో కూడిన పాట. నాకు ఇష్టమైన పాట. గేయ రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. వేటూరి గారు గుర్తుకొచ్చారు. ‘చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలైనా, అందం నీ ఇంట చేస్తుందా ఊడిగమే.. అనే ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా అనిపించాయి. విశాల్ ఈ పాటని ఒక రోజులో చాలా ఆర్గానిక్ గా క్రియేట్ చేశారు. రాయడానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ముచ్చటగా వుంటారు. దిష్టి తీయాలనిపిస్తుంది. ఇంత అద్భుతంగా చూపించిన పీఎస్ వినోద్ గారికి కృతజ్ఞతలు” తెలిపారు.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ పాట విన్న ప్రతిసారి మనసు హాయిగా వుంటుంది. ప్రేక్షకులు ‘సీతా రామం’ అమితంగా ప్రేమిస్తారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగా వుంటుంది. ‘సీతా రామం’ గొప్ప కథ. రామ్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా కనిపిస్తారు. దుల్కర్ సల్మాన్ గారితో పని చేయడం గొప్ప అనుభవం. ఈ ఇంత భారీ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు స్వప్న, వైజయంతి మూవీస్, దర్శకుడు హను రాఘవపూడి గారికి కృతజ్ఞతలు” తెలిపారు.
విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..హను రాఘవపూడి గొప్ప సంగీత అభిరుచి వున్న దర్శకుడు. ఈ చిత్రంలో పాటలన్నీ వైబ్రెంట్ గా వుంటాయి. ప్రతి పాట మనసుని హత్తుకునేలా వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాకి కృతజ్ఞతలు” తెలిపారు.
గేయ రచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ లో పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు హను రాఘవపూడి అచ్చమైన తెలుగు పాటలు రాయిస్తుంటారు. ఈ పాట కూడా 1965 లో ఉండేలా స్వచ్చమైన తెలుగు పాట రామని సందర్భం చెప్పినపుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో ఈ పాట అత్యద్భుతంగా వుంటుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన జోడి. ఈ సినిమా ఒక దృశ్యం కావ్యంలా వుంటుంది” అన్నారు.
టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పిస్తున్న ఈ చిత్రంపై ఈ భారీ అంచనాల వున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిక్ పాత్రలో కనిపించనున్నారు.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు