TTD:సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

13
- Advertisement -

ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభ‌వంగా నిర్వహించేందుకు ప‌గ‌డ్భంది ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి శుక్ర‌వారం ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఏసిలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభ‌వంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. కల్యాణానికి వ‌చ్చే భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. కౌంట‌ర్ల‌లోను, గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తులకు ప్ర‌సాదాల పంపిణీకి అవ‌స‌ర‌మైనంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌న్నారు.

భద్రత, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, కల్యాణోత్సవం సందర్బంగా విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -