ఆదివారం సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి సీతారాం ఏచూరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. 23వ మహాసభలో ముసాయిదా రాజకీయ తీర్మానాలు జరిగాయి. రెండు నెలల ముందు పార్టీ కాంగ్రెస్‌లో బహిరంగపరుస్తాం…ఏవైనా సవరణలు ఉంటే చేస్తామన్నారు. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు కన్నూర్ లో పార్టీ కాంగ్రెస్ జరుగుతుంది అన్నారు.
ప్రస్తుత సమయంలో భాజపాకు వ్యతిరేకత భారీగా పెరిగింది. భాజపా ఓటమి లక్ష్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కృషి చేస్తాం.. 5 రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో ఓట్లలో చీలిక లేకుండా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అన్ని విషయాల్లో, రంగాల్లో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారు.కోవిడ్‌ను అరికట్టడంలో విఫలమయ్యారు.. మరొకపక్క ఆర్థిక సంక్షోభం పెరుగుతోంది, ఉపధికల్పన లేదు, పెట్రోలియం ధరలు భారీగా పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో..ప్రధానితో సహా..ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా భాజపా పన్నాగం పన్నుతోంది. భాజపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.. ప్రతి పౌరుడు రాజ్యాంగ బద్దంగా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ చూడాలి.. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాం. ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఎన్నికల తర్వాతే ఉంటుంది..పంజాబ్‌లో ప్రధాని వెళ్లాల్సిన సమావేశంలో ప్రజలు రాలేదు.. కానీ ప్రధాని పర్యటనలో సెక్యూరిటీ లాప్స్ ఉంటే సీరియస్ చర్యలు తీసుకోవాలి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా రాజకీయ వాతావరణం నెలకొందని సీతారాం ఏచూరి అన్నారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. భాజపాను వ్యతిరేకిస్తూనే…కలివచ్చే వారితో ముందుకెళతాం..కేసీఆర్ భాజపాను సూటిగా వ్యతిరేకించడంలేదు.. కొన్ని విషయాల్లో మాత్రమే వ్యతిరేకిస్తున్నారు..భాజపా సాఫ్ట్ కార్నర్ కు మేం వ్యతిరేకం అని తెలిపారు.