రివ్యూ:సీత

650
seeta review

బెల్లంకొండ శ్రీనివాస్‌-కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం సీత. తేజ దర్శకత్వంతో టాలీవుడ్‌కు పరిచయమైన కాజల్..తాజాగా సీతగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంతో దర్శకుడు తేజ మరోసారి మ్యాజిక్ చేశాడా..?సీతతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..

కథ:

తాను గెలవడం కోసం దేనికైనా తెగించే అమ్మాయి సీత(కాజల్).కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బసవ(సోనూసూద్)తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడినుండే సీతకు కష్టాలు మొదలవుతాయి. ఈ క్రమంలో అమాయకుడైన రఘురామ్‌(బెల్లంకొండ శ్రీనివాస్)ను ట్రాప్ చేసి తన లక్ష్యం సాధించుకోవాలని భావిస్తుంది సీత. సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరుగుతుంది..?రామ్‌…సీతను సమస్యల నుండి బయటపడేశాడా..?చివరికి కథ ఎలా సుఖాంతమైందనేది తెరమీద చూడాల్సిందే.

Image result for సీత రివ్యూ

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌ కాజల్,కొన్ని కామెడీ సీన్స్,ఫస్టాఫ్‌. డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉన్న సీత పాత్రకు వందశాతం న్యాయం చేసింది కాజల్‌. తన సహజనటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక అమాయకుడైన వ్యక్తిపాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ అదరగొట్టాడు.తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిత్తిరి సత్తి,మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ కథ,కథనం,బలహీన సన్నివేశాలు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.నేటితరం అమ్మాయిలకు దర్శకుడు తేజ చెప్పాలనుకున్న కాన్సెప్ట్‌ బాగుంది. అనిల్ సుంకర నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for సీత రివ్యూ

తీర్పు:

నేటితరం అమ్మాయిలలో కనిపిస్తున్న స్వార్ధం, డబ్బు వంటి లక్షణాలను చూపిస్తూ దర్శకుడు తేజ చేసిన ప్రయత్నమే సీత. ఫస్టాఫ్ అంతా కొన్ని ఎమోషనల్, కొన్ని కామెడీ సీన్స్ తో ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ వీకెండ్‌లో పర్వాలేదనిపించే మూవీ సీత.

విడుదల తేదీ:24/05/2019
రేటింగ్:2.5/5
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాణ బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌
దర్శకత్వం : తేజ