సుబ్బరాజు.. గుట్టు విప్పాడు

243
SIT Officials Investigate Character Artist Subbaraju
- Advertisement -

డగ్స్‌ కేసులో నోటీసులు అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు ఇవాళ సిట్ ముందు హాజ‌ర‌య్యాడు. ఉదయం 10.15 గంటలకు విచారణ ప్రారంభమైంది. దాదాపు 7 గంట‌ల పాటు ఆయ‌న‌ను సిట్ విచారించింది. కెల్విన్ తో ఉన్న సంబంధాల‌పై సుబ్బ‌రాజును ప్ర‌శ్నించింది సిట్. మూడో రోజు విచార‌ణ పూరైంది. గ్రేటర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని బార్లు, ప‌బ్ ల ఓన‌ర్లు, మేనేజ‌ర్ల‌తో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు సిట్ ప్రత్యేక స‌మావేశం అవ‌నుంది. ఇక‌.. నాలుగో రోజు శ‌నివారం న‌టుడు త‌రుణ్ సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వనున్నాడు. నోటీసులు ఇచ్చిన తేదీ ప్ర‌కారమే ముమైత్ ఖాన్ కూడా హాజ‌ర‌వ‌నున్న‌ట్లు సిట్ ప్ర‌క‌టించింది.

ఈ సందర్భంగా సుబ్బరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కింద పేర్కొన్న ప్రశ్నలను అధికారులు అడిగినట్టు తెలుస్తోంది.

SIT Officials Investigate Character Artist Subbaraju

మీకు డ్రగ్స్ అలవాటు ఉందా?
పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటారా?
పూరీ ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా?
పూరీతో కలసి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఏ ఫోన్ నెంబర్లు వాడారు?
అక్కడ ఏం చేశారు?
అక్కడ పూరీ విదేశీ నంబర్లు వాడారు… మీకు తెలుసా?
కెల్విన్ తెలుసా?
ఎలా పరిచయం అయ్యాడు?
పూరీ, శ్యామ్ లతో పాటు మీరూ కెల్విన్ ను కలిసేవారా?
పూరీ ఇంట్లో పార్టీలో ఏం జరిగేది?
మీరు డ్రగ్స్ పార్టీలకు వెళ్లేవారా?
కెల్విన్ తో మీరు డైరెక్ట్ గా డీల్ చేసేవారా?
కెల్విన్ కు మీరు ఎవరెవరిని పరిచయం చేశారు?
మీకు ఎంత మంది ఈవెంట్ ఆర్గనైజర్లు తెలుసు?
సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది?
మీ రక్త నమూనాలు, గోళ్లు, వెంట్రుకలను పరీక్షలకు తీసుకోవచ్చా?

- Advertisement -