- Advertisement -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే నిందితులను పలుమార్లు విచారించిన అధికారులు ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు.
నవంబర్ 26న లేదా 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు పంపాలని హైకోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు విచారణకు రావాలతీ అయినా ఆయన విచారణకు హాజరు కాలేదు. న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీ పోలీసుల సహాయంతో రెండురోజుల క్రితమే సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున విచారణకు రావడానికి సమయం కావాలని కోరుతూ సంతోష్ సిట్ కు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -

