టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) తన పని వేగవంతం చేసింది. నోటీసులు అందుకున్న వారిని ఒక్కొక్కరుగా విచారణకు పిలిపించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మొదలుకొని ఇప్పటివరకు నటుడు సుబ్బరాజు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడులను ఇప్పటివరకు విచారించారు. తాజాగా హీరో తరుణ్ ను ఎక్సైజ్ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. 10 గంటల నుంచి మొదలైన ఈ విచారణ దాదాపు 13 గంటలు జరిగినట్టు సమాచారం.
తరుణ్ నెలలో అత్యధిక రోజులు గోవాలో గడుపుతుంటాడట. అక్కడ బీచ్ లో దిగిన పలు ఫొటోల్లో డ్రగ్స్ కేసులో నిందితులు కూడా ఉన్నారట. దీంతో ఆ ఫొటోలన్నీ అతడి ముందుపెట్టి వారితో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు ఎక్కుపెట్టారని తెలుస్తోంది. గోవా టూరిస్ట్ ప్లేస్ కావడంతో పాటు అక్కడ డ్రగ్స్ వాడకమూ ఎక్కువే. బీచ్ హౌస్ ల్లో జరిగే పార్టీలు వాటిలో డ్రగ్స్ వాడకంపైనా కొశ్చన్స్ అడిగారనేది టాక్. పబ్బుల్లో జరిగే పార్టీల్లో డ్రగ్స్ వాడుతారని..సిట్ విచారణలో తరుణ్ చేప్పాడని సమాచారు. అంతేకాదు పలువురు యువ నటులు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని సిట్ విచారణలో తరుణ్ తెలిపినట్టు సమాచారం.
యువ నటుడు తరుణ్ ను సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి విచారించారు ఈ విచారణ దాదాపు 13 గంటలు జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా తరుణ్ పై వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తరుణ్ ను సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ఇవి…
కెల్విన్ డ్రగ్స్ సప్లయర్స్ కాల్ లిస్ట్ లో నీ పేరు ఎందుకుంది?
పబ్ ను ఎంత కాలం నడిపావు?
ఏఏ ఈవెంట్లను నిర్వహించావు?
ఏ ఈవెంట్ ఆర్గనైజర్లు డ్రగ్స్ సప్లై చేశారు?
నెలలో 15 రోజులు గోవాలో ఎందుకు ఉంటావు?
గోవాలో నీకు డ్రగ్స్ ఎవరిస్తారు?
గోవా బీచ్ హౌస్ లో డగ్స్ వాడుతున్నావా?
సినిమాలు చేయడం మానేసి, డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించావా?
హైదరాబాదులోని ఇతర పబ్ ఓనర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?
పబ్ లలో డ్రగ్స్ దొరుకుతున్నాయన్న ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి?
ఇలాంటి ప్రశ్నలతో తరుణ్ ను సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు.