- Advertisement -
లాక్ డౌన్ వేళ టాలీవుడ్లో పెళ్లి సందడి నెలకొంది. ఇప్పటికే హీరో నిఖిల్, నితిన్,రానా వివాహం నిరాడంబరంగా జరుగగా మెగా డాటర్ కొణిదెల నిహారిక ఎంగేజ్మెంట్ ఇటీవలె జరిగింది. తాజాగా మరో టాలీవుడ్ నటుడు ఎంగేజ్ మెంట్ జరిగింది.
రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు చెంబోలు రాజా తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు. కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ఎంగేజ్మెంట్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే కాబోయే భార్య వివరాలు మాత్రం తెలుపలేదు. ఫిదా సినిమాలో వరుణ్ తేజకు అన్నయ్యగా నటించారు రాజా.
- Advertisement -